కార్టోశాట్-3 ఉపగ్రహాన్నిప్రయోగించనున్న ఇస్రో
- November 19, 2019
హైదరాబాద్: ఈనెల 25వ తేదీన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. కార్టోశాట్-3తో పాటు మరో 13 కమర్షియల్ నానోశాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. హై రెజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్-3ని రూపొందించారు. ఇది థార్డ్ జనరేషన్‌కు చెందినది. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా కార్టోశాట్-3ని నింగిలోకి ప్రయోగిస్తారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనున్నది. సుమారు 509 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో కార్టోశాట్‌ను ఫిక్స్ చేయనున్నారు. నవంబర్ 25వ తేదీన ఉదయం 9.28 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనున్నది. ఇటీవల న్యూస్పేస్ ఇండియాతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో.. అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా కార్టోశాట్‌తో నింగిలోకి పంపనున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!