ఒమన్‌ వెదర్‌: భారీ వర్షాలతో స్కూళ్ళ మూసివేత

- November 21, 2019 , by Maagulf
ఒమన్‌ వెదర్‌: భారీ వర్షాలతో స్కూళ్ళ మూసివేత

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళలో గురువారం తరగతుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా గవర్నరేట్స్‌లో భారీ వర్షాలు పడుతుండడంతో మినిస్ట్రీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మస్కట్‌, నార్త్‌ అల్‌ బతినా, సౌత్‌ అల్‌ బతినా, అల్‌ దఖ్లియా మరియు నార్త్‌ అల్‌ షర్కియాలో స్కూళ్ళు, మినిస్ట్రీ ఆదేశాలతో ఈ రోజు మూసివేయబడనున్నాయి. ముందస్తు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com