140 మంది వలసదారులపై డిపోర్టేన్‌, 120 షాపుల మూసివేత

- November 21, 2019 , by Maagulf
140 మంది వలసదారులపై డిపోర్టేన్‌, 120 షాపుల మూసివేత

కువైట్‌ సిటీ: కువైట్‌ మునిసిపాలిటీ ఇటీవల నిర్వహించిన క్యాంపెయిన్‌లో 140 మంది వలసదారులపై డిపోర్టేషన్‌ విధించారు. అలాగే 120 షాప్‌లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైఎక్టర్‌ జనరల్‌ అహమద్‌ అల్‌ మన్‌ఫోహి, ఇంటీరియర్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇస్సామ్‌ అల్‌ నహామ్‌ ఈ తనిఖీలకు నేతృత్వం వహించారు. పలు ఉల్లంఘనలకు సంబంధించి 140 లేబరర్స్‌ని డిపోర్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌కి రిఫర్‌ చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 200,000 మంది నివసిస్తున్నారనీ, తక్షణం అక్కడి పరిస్థితులపై వాస్తవ నివేదికలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అల్‌ మన్‌ఫోహి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com