జీలకర్ర తో ఉపయోగాలు

- November 22, 2019 , by Maagulf
జీలకర్ర తో ఉపయోగాలు

జీలకర్రను తాలింపులో వాడతాము అనే విషయం మనందరికి తెలిసింది. కానీ... జీలకర్రలో మన ఆరోగ్య సమస్యల్ని తగ్గించే మంచి ఔషద గుణాలు దాగి ఉన్నాయి. జీలకర్రని తరచూ నమిలి రసం మింగుతూ ఉంటే కడుపులో ఉన్న నులిపురుగులను నివారించడమే కాదు, ఉధర సంబంద వ్యాదులను తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్రలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.

1. కడుపులో వికారంగా ఉండి, పుల్లని తేపులతో బాధపడేవారు కొంచెం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది.

2. జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే అలర్జీ వల్ల కలిగే బాధలు తగ్గుతాయి.

3. డయేరియాతో బాధపడేవారు టీ స్పూను జీలకర్రను నీటితో తీసుకోవాలి. అలాగే టీ స్పూను చొప్పున కొత్తిమీర రసం, జీలకర్ర, చిటికెడు ఉప్పు కలిపి తూసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తరువాత ఇలా రెండుసార్లు తీసుకోవాలి.

4. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీపీని అదుపులో ఉంచుతుంది. గుండె సంబందిత వ్యధులు రాకుండా కాపాడుతుంది.

5. నల్ల జీలకర్ర మూలశంక(పైల్స్)కు మంచి మందు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్ల జీలకర్రను వేయించి, మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com