వ్యక్తి మూత్రం తాగి..పేషెంట్ ప్రాణాలు కాపాడాడు
- November 23, 2019
ఆలోచించడానికి టైమ్ లేదు.. వైద్యుడిగా మరో ఆలోచన లేకుండా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే అతడి ముందున్న కర్తవ్యం. విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ తోటి ప్రయాణికుడి ఇబ్బందిని గమనించారు. చైనా జువాంగ్‌జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్‌కు బయలుదేరింది. మరో 6 గంటల్లో న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం లాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈలోపు 70 ఏళ్ల ఓ వ్యక్తి పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. బాధ భరించరానిదిగా ఉంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ జాంగ్ హాంగ్ తోటి ప్రయాణికుడి పరిస్థితిని గమనించారు. ఆయన ప్రోస్టేట్ గ్రంధి వ్యాకోచంతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. మూత్రాశయం నుంచి తరచుగా మూత్రాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుందని లేకపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గుర్తించారు. మరో ఆలోచన లేకుండా పేషెంట్ మూత్ర ద్వారానికి డాక్టర్ ఓ ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బయటకు పీల్చారు. అలా పీల్చిన మూత్రాన్ని ఓ ఖాళీ వైన్ బాటిల్లో పోస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేసి అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







