వాట్సప్‌తో జాగ్రత్త! టెలిగ్రామ్ అధినేత హెచ్చరిక
- November 24, 2019
వాషింగ్టన్ : లక్షలాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహిస్తూ, వారిపై నిఘాను కొనసాగిస్తున్న వాట్సప్ అప్లికేషన్‌ను వెంటనే తొలగించుకోవాలని, టెలిగ్రామ్ యాప్ ఆవిష్కర్త పావెల డ్యూరోవ్ హెచ్చరిస్తున్నారు. టెలిగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఓ కథనంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. వాట్సప్ అప్లికేషన్ 'ట్రోజన్ హార్స్' వంటిదని, లక్షలాది మంది వినియోగదారులు భావిస్తున్నట్లు ఇది ఫేస్బుక్ సంస్థకు చెందినదే అయినప్పటికీ, వ్యక్తిగత వివరాల చోరీతో ప్రైవసీ కుంభకోణాలకు పాల్పడుతోందని వివరించారు. మాతృసంస్థ లక్ష్యాలను, ఉద్దేశాలను కాలరాస్తున్న వాట్సప్ యాప్‌ను వినియోగిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాక ముందే వారు దానిని మొబైల్ ఫోన్ల నుండి తొలగించాలని ఆయన సూచించారు. ఫేస్‌బుక్‌తో తాను దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రైవసీ సంబంధిత సమస్యలను ఆయన వివరించారు. వాట్సప్ మీ సందేశాలను పరిరక్షించటంలో మాత్రమే కాదు, మీ వ్యక్తిగత వివరాల పరిరక్షణలో కూడా ఘోరంగా విఫలమవుతోందని, ట్రోజన్ హార్స్ తరహాలో సందేశాలు, ఫొటోలపై నిరంతర నిఘా కొనసాగిస్తోందన్నారు. ఒక హాకర్ పంపిన వీడియో సందేశాన్ని తెరిస్తే మీకు సంబంధించిన మొత్తం సమాచారం అంతా కూడా హాకర్ చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







