గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ...
- November 25, 2019
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. 2.30 గంటల సమయంలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై భేటీ జరగబోతుంది. రాజ్ భవన్ లో వీరిద్దరి భేటీ జరగబోతుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ గురించి గవర్నర్, సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై తన నిర్ణయాన్ని గవర్నర్ కు వివరించనున్నారు. అసెంబ్లీ సమావేశాల గురించి కూడా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముఖ్యమైన వివరాలను సీఎం కేసీయార్ గవర్నర్ కు వివరించబోతున్నారని సమాచారం. కొత్త రెవిన్యూ చట్టం గురించి కూడా కేసీఆర్ గవర్నర్ తో చర్చించబోతున్నారని సమాచారం. ఆర్టీసీ సమ్మె , ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాల గురించి ముఖ్యంగా కేసీఆర్ , గవర్నర్ మధ్య చర్చ జరగబోతుందని సమాచారం. దాదాపు 90 రోజుల తరువాత గవర్నర్, సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు.
ఆర్టీసీపై ప్రభుత్వ విధానం, కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలకమైన విషయాలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించనున్నట్లు సమాచారం. గత మూడు నెలలలో జరిగిన పరిణామాల మీద కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. 52 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి సమ్మె విరమిస్తామని కార్మికులు ప్రకటించినా ప్రభుత్వం కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోకపోవటానికి కారణాలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించనున్నారు.
కార్మికులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత కొన్ని పార్టీల నేతలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె గురించి గవర్నర్ తమిళిసైని కలిశారు. రెవిన్యూ శాఖలో సీఎం కేసీఆర్ చేయబోతున్న ప్రక్షాళన గురించి కూడా కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి వివరించబోతున్నారని సమాచారం. సీఎం కేసీఆర్, గవర్నర్ భేటీ తరువాత కొన్ని కీలకమైన నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!