పొట్లకాయ,సొరకాయ తో ఉపయోగాలు...
- November 28, 2019పొట్లకాయలు రుచికరమైన ఆహారం, ఎటువంటి వ్యాధుల్లోనయినా ఈ కూర పెట్టవచ్చును. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారు ఎక్కువగా పొట్లకాయ కూర తినడం వలన వ్యాధి బాధలు నివారిస్తాయి.
1. పొట్లకాయ కూర లైంగికశక్తిని కూడా పెంపొందిస్తుంది. పిల్లల కడుపులో పాముల్ని పోగొడుతుంది.
2. సొరకాయ కూడా.. పురుషులలో వీర్యవృద్ధినీ, లైంగిక శక్తిని పెంచుతుంది. సొరకాయ కూరను చాలామంది పథ్యం కూరగా భావిస్తారు. కానీ తరచుగా తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
3. ఇది శరీరంలో వేడిని, కఫాన్ని తగ్గిస్తుంది. దప్పికను నివారిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
4. హృదయ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం. దీనితో పాటు శొంఠి పొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకుంటే పడని వారికి జలుబు చేయదు.
5. సొరకాయ గింజలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. సొరకాయ ముదురు గింజలను వేయించుకుని, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి, కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే పురుషులకు చాలా మంచిది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు