90 మంది భారతీయ విద్యార్థులు అరెస్టు
- November 29, 2019అమెరికాలో ఉన్నత విద్యకోసం కలలు కంటున్న విద్యార్థుల బలహీనతలను ఆసరాగా చేసుకొని దళారులు రెచ్చిపోతున్నారు. తమ ఉచ్చులోకి లాగి నిలువునా దోచుకుంటూ ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఫార్మింగ్టన్ యూనివర్శిటీలో చదువుతున్న 90 భారత విద్యార్ధులను అరెస్ట్ చేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.
వీసా పొందడానికి నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన 90 మంది ఇండియన్స్ అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రోపాలిటిన్ ఏరియాలో మూసేసిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్లో ప్రవేశం పేరుతో వీసాపై అమెరికాలోకి వచ్చిన 250 మందిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది.
ఈ నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన 161 మందిని ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. ఈ వర్సిటీని మార్చిలోనే మూసివేయగా ప్రస్తుతం 600 మంది విదేశీ విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందారు. వీరిలో అధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు. ఇది నకిలీ యూనివర్శిటీ అని తెలిసిన విద్యార్ధులు కావాలనే చేరుతున్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుపుతున్నారు.
నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొంది, చట్టబద్దంగా అమెరికా ఎంబసీ నుంచి వీసా దక్కించుకున్నవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. చట్టబద్ధంగా వీసాను పొందడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులను కొంతమంది తమ ఉచ్చులోకి లాగుతున్నారు దళారులు. అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా ట్రంప్ సర్కార్‌పై డెమోక్రాటిక్నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి నకిలీ యూనివర్సిటీ ఉచ్చులో అమాయక విద్యార్థులు చిక్కుకున్నారు. ఉన్నత చదువులు చదవాలనే ఆశతో.. దళారుల మాటలు నమ్మి మోసపోయారు. తీరా ఆ యూనివర్సిటీలో చేరాక.. అదంతా ఫేక్ అని తెలిసేలోపే చేతికి సంకెళ్లు పడ్డాయి. ఇపుడేమి చేయాలో పాలుపోక జైల్లో మగ్గుతున్నారు. ఎలాగైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమను విడిపించాలని కోరుతున్నారు. చదువు విషయంలో ఎవర్నీపడితే వాళ్లను నమ్మి తమలా మోసపోవద్దని తోటి విద్యార్థులకు హితవు పలుకుతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్