అమెరికాలో గ్రీన్ కార్డు కోసం భారతీయుల కుటుంబాల ఎదురుచూపులు
- November 29, 2019అమెరికాలో భారీ సంఖ్యలో భారతీయులు కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డ్ (చట్టపరమైన శాశ్వత నివాసం) కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో మొత్తం 40 లక్షల మంది ప్రజలు ఈ రకమైన గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, అమెరికా ప్రభుత్వం మాత్రం ఏటా 2,26,000 మాత్రమే జారీ చేయాలని నిర్ణయించింది. వీటికోసం ఎదురు చూస్తున్న వారిలో మెక్సికో దేశానికి చెందిన 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన 2,27,000 మంది ఉండగా 1,80,00 మంది చైనీయులు కూడా ఈ జాబితాలో వేచిచూస్తున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ఎదురు చూస్తోన్న భారతీయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోని వారిలో చాలా మంది ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉన్నవారి కుటుంబసభ్యులే కావడం విశేషం. ప్రస్తుత చట్టం ప్రకారం అమెరికా పౌరులు వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులకు గ్రీన్‌కార్డ్ లేదా శాశ్వత నివాసాన్ని స్పాన్సర్ చేయవచ్చు. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని రద్దు చేయాలని అయన ఎప్పటి నుంచో భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..