దుబాయ్:బిగ్ బ్రాండ్స్..బిగ్ డిస్కౌంట్స్
- December 01, 2019
దుబాయ్:కాన్సెప్ట్ బిగ్ బ్రాండ్స్ కార్నివాల్-సీబీబీసీ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. దాదాపు 300 బ్రాండ్లు తమ ఉత్పత్తులను 80% భారీ తగ్గింపులో వినియోగదారులకు అందించనున్నాయి.
డిసెంబర్ 2 నుంచి 5 వరకు కాన్సెప్ట్ బిగ్ బ్రాండ్స్ కార్నివాల్ ప్రారంభం కానుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని హాల్ 8లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరగనున్నాయి.
స్టీల్ మాడెన్, మాక్స్ ఫ్యాక్టర్, పాబ్లొస్కి తరహా ప్రసిద్ధి గాంచిన బ్రాండ్లు 80% తగ్గింపు ధరలో లభించనున్నాయి. భారీ తగ్గింపుతో పాటు సందర్శకులకు సీబీబీసీ ఉచిత కానుకలు కూడా అందించనుంది.
పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా అన్ని వర్గాల వారికి అవసరమైన దుస్తులు, నగలు, కాస్మోటిక్స్, పెర్ఫ్యూమ్స్ సీబీబీసీలో లభించనున్నాయి. ఈ శీతాకాలంలో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ ఫెస్టివ్ సీజన్ సరైన వేదిక కానుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు