తెలంగాణ:ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాల జల్లు..
- December 01, 2019
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం ఏర్పటు చేసిన కేసీఆర్..సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసానిచ్చారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేట్ బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమన్నారు.
ఇక వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని కార్మికులకు సూచించారు. ప్రతీ ఏడాది రూ.1000 కోట్లు లాభం ఆర్టీసీకి రావాలి. ప్రతీ ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష బోనస్ అందుకునే స్థితికి తీసుకరావాలని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!