దిశ హత్యాచారంపై 'సిట్' ఏర్పాటు
- December 05, 2019
తెలంగాణ:భారత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం విచారణకు రాష్ట్రప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు విచారణను స్పీడుగా పూర్తి చేయటానికి బుధవారమే హై కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయటంతో కేసు విచారణను ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధమవుతోంది.
సిట్ బృందం శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పింది. డిసిపి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో నలుగురు అడిషినల్ డిసిపిలున్నారు. వీరిలో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. మొత్తం మీద దిశ హత్యాచారానికి పాల్పడి నలుగురు నిందులకు కోర్టు వారం రోజులు పోలీసు కస్టడీకి అప్పగించిన మరుసటి రోజే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయటం గమనార్హం.
అంటే ఇప్పటి వరకూ జరిగిన మొత్తం విచారణ నివేదికను పోలీసులు సిట్ కు అప్పగించేస్తారు. ఇకనుండి విచారణ మొత్తాన్ని సిట్ తన బృందంతోనే ప్రత్యేకంగా చేస్తుంది. కేసు విచారణ విషయంలో కావచ్చు, నిందితుల విషయంలో కావచ్చు జనాల్లోని ఆగ్రహం చూసిన తర్వాత విచారణలో వేగాన్ని పెంచటానికి ప్రభుత్వం కూడా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది.
కేసు విచారణలో ఎక్కడైనా పొరబాటు జరిగితే ప్రత్యక్షంగా పోలీసు శాఖ మీద తర్వాత ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ నలుగురు నిందితులే దిశపై హత్యాచారం చేశాడని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలను సేకరించటంలో దర్యాప్తు అధికారులు గట్టిగానే పనిచేస్తున్నారు.
జనాల ఆకాంక్షలకు అనుగుణంగా నిందితులు నలుగిరికి శిక్షలు పడాలంటే దర్యాప్తులో ఫోరెన్సిక్ నివేదికే చాలా కీలకమవుతుంది. అందుకనే దర్యాప్తును మామూలు పోలీసు అధికారుల పర్యవేక్షేణలో కాకుండా సీనియర్ అధికారులైన ఐపిఎస్ తో చేయించటమే మేలని ప్రభుత్వం భావించింది. అందుకనే వెంటనే సిట్ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







