అబుధాబి లో 9 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్న చర్చి
- December 05, 2019
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) పారిష్ అబుదాబి: 'ఇయర్ ఆఫ్ టాలరెన్స్' కు ప్రతీకగా అబుధాబి లో మరో కట్టడం రూపుదాల్చనుంది. అదే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ). అబుదాబి నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబు మురైకాలో అనగా దుబాయ్-అబుధాబి షేక్ జాయెద్ హైవే పై అల్ రహ్బా సమీపంలో నిర్మితమవుతున్న మొదటి BAPS హిందూ దేవాలయం పక్కన ఈ చర్చి ని కట్టనున్నారు.
"ప్రభుత్వం మాకు 4.37 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ప్రధాన ఆవరణ నిర్మాణం 1,200 చదరపు మీటర్లు కలిగి షుమారు 750 మంది ప్రార్ధనలు చేసుకునే వెసులుబాటు ఉండేవిధంగా కట్టటం జరుగుతుంది. కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, వినోద కేంద్రం, పార్కింగ్ స్థలాలు మరియు మరిన్ని సౌకర్యాలు కూడా ఈ చర్చి లో ఉంటాయి. 9 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్న ఈ చర్చి కి ధనం మొత్తం శ్రేయోభిలాషుల నుండి స్వచ్ఛందంగా స్వీకరించబడుతుంది. ఫుజైరా తర్వాత ఇదే పెద్ద చర్చి అవుతుంది ” అని చర్చి మతగురువు రెవ్ సోజీ వెర్గిస్ జాన్ తెలిపారు.
డిజైన్ దాదాపు ఖరారు చేయబడింది..నిర్మాణ పనులకు 10 నెలలు పడుతుంది కాబట్టి 2021 మొదటి త్రైమాసికంలో చర్చి ప్రారంభమవుతుందని సిఎస్‌ఐ సెంట్రల్ కేరళ డియోసెస్ మతాధికారుల కార్యదర్శి రెవ్ జాన్ ఐజాక్ తెలిపారు.
సిఎస్‌ఐ మోడరేటర్, సెంట్రల్ కేరళ డియోసెస్ బిషప్ మోస్ట్ రెవ్ థామస్ కె. ఉమెన్ శుక్రవారం సాయంత్రం సెయింట్ ఆండ్రూ చర్చిలో కొత్త చర్చి భవనం యొక్క పునాది రాయి ఆశీర్వాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాతి వేయడం శనివారం ఉదయం అబూ మురైకాలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 'ఇయర్ ఆఫ్ టాలరెన్స్' మంత్రి ‘షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్’ విచ్చేయనున్నారు. వీరితో పాటు కమ్యూనిటీ డెవలప్‌మెంట్, జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్‌కు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరు కానున్నారు.
చర్చిని నిర్మించడానికి భూమిని కేటాయించినందుకు, ‘Year of Tolerance’ లో మా కోరికలను నెరవేర్చినందుకు చర్చి నిర్వాహకులు యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మించనున్న చర్చి గురించి క్లుప్తంగా:
స్థలం: అబూ మురైఖా (దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవే పై అల్ రహ్బా సమీపంలో)
మొత్తం భూభాగం: 4.37 ఎకరాలు
చర్చి ప్రాంతం: 1,100-1,200 చ
సామర్థ్యం: 750 మంది
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







