దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు..
- December 06, 2019
భారత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను షాద్‌నగర్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశువులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో.. దిశకు సరైన న్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు దిశ తల్లిదండ్రులు కూడా.. నిందితులకు తగిన శిక్ష పడిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కునేందుకు నిందితులు ప్రయత్నించిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సీపీ సజ్జనార్.. గతంలో వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ యువతిపై యాసిడ్ అటాక్ జరిగింది. ఇక అప్పట్లో దాడి చేసిన నిందితులను వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారు.ఇప్పుడు దిశ అత్యాచారం కేసులో కూడా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం సజ్జనార్ సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా, నిందితులను తక్షణమే ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేశారు. అటు సజ్జనార్‌ను కూడా పలు సందర్భాల్లో కలిసి ఎన్‌కౌంటర్ చేయాలని చాలామంది విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







