ఒమన్ లో 11వేలకుపైగా కొత్త నీటి కనెక్షన్లు.
- December 06, 2019
మస్కట్:బౌషర్ ప్రాంత ప్రజలకు ఇక నీటి కష్టాలు తొలగిపొనున్నాయి. బౌషర్ పరిసర ప్రాంతాల్లో కొత్తగా 11 వేలకు పైగా గృహాలకు నీటి కనెక్షన్లు అందించనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ వాటర్ అధికారి దియామ్ ప్రకటించారు.
ఆన్ లైన్ లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం "ప్రస్తుత వాటర్ నెట్ వర్క్ ద్వారా బవ్షర్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోని 11,500 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపేందుకు గర్విస్తున్నాం."అని పేర్కొన్నారు.
మస్కట్ గవర్నరేట్‌లోని బవ్షర్ పరిధిలో అల్ అవాబీ, ఫలాజ్ అల్ షామ్, సనాబ్, అల్ హమామ్ అల్ జదీద్ స్కీమ్, బవ్షర్ కమర్షియల్ డిస్ట్రిక్ట్,బౌషర్ హైట్స్ ఫేజ్ I, II,VIతో పాటు ఘాలా హైట్స్ 4, 5,6 ప్రాంతాలలో కొత్త నీటి కనెక్షన్లను పూర్తి చేసినట్లు దియామ్ వివరించారు.
తమ ప్రాంతాల్లో వాటర్ సప్లై కావాలనుకునేవారు బౌషర్ లోని కస్టమర్ సర్వీసెస్ హాల్ లో దరఖాస్తు చేసుకోవాలని దియామ్ తెలిపారు. ఇందుకు మున్సిపాలిటీ ఆమోదించిన నీటి సరఫరా దరఖాస్తు పత్రం, బిల్డింగ్ కు అనుమతి పత్రం, బిల్డింగ్ పూర్తి అయినట్లుగా ధృవపత్రాలను రిక్వెస్ట్ ఫాంతో జాతి ప్రచారం చేసి ఉంటుంది. నాన్ రెసిడెన్షియల్ ధరకాస్తుదారులైతే.. ఐడీ కార్డు కాపీ, ఓనర్ షిప్, సర్వే కాపీ, ఎలక్ట్రిసిటీ బిల్ జతపరచాలని వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







