'పేదల ఆత్మహత్య'లపై లెబనాన్‌లో వెల్లువెత్తిన నిరసనలు

- December 06, 2019 , by Maagulf
'పేదల ఆత్మహత్య'లపై లెబనాన్‌లో వెల్లువెత్తిన నిరసనలు

బీరూట్‌ : దేశంలో నిరుపేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న వార్తలు వెలుగు చూడటంతో లెబనాన్‌ రాజధాని బీరూట్‌ నగరంలో బుధవారం నాడు ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుత పాలకవర్గానికి వ్యతిరేకంగా ఉధృత స్థాయిలో నినాదాలుచేసిన నిరసనకారులు ప్రస్తుత రాజకీయ నేతలు తమ పదవులను వదిలి దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించే సత్తా, నైపుణ్యం వున్న వారికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. లెబనాన్‌ పోలీసు దళానికి చెందిన ఒక సభ్యుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారని, మరో పౌరుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక మీడియాలో వార్తలు వెలువడటంతో ఈ ఆత్మహత్య లకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోం దని అధికారులు చెప్పారు. ఇదిలా వుండగా బుధవారం రాత్రి రుణభారాన్ని తట్టుకోలేని ఒక టాక్సీ డ్రైవర్‌ ఒక భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడని, అయితే ప్రజలు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారని జాతీయ మీడియా తన వార్తా కథనాలలో వివరించింది. లెబనాన్‌లో ప్రస్తుత పాలక వర్గానికి వ్యతిరేకంగా గత అక్టోబర్‌ 17 నుండి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com