కువైట్:డ్రైవర్ల నియామకంపై నిబంధనలు

- December 07, 2019 , by Maagulf
కువైట్:డ్రైవర్ల నియామకంపై నిబంధనలు

కువైట్ లో డ్రైవర్ల నియామకంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఇక నుంచి కుటుంబానికి ఇద్దరు డ్రైవర్లను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు అన్ని డైరెక్టరేట్లలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక దినపత్రిక   అల్-అన్బా తన కథనంలో వెల్లడించింది.

ఒకవేళ మూడవ డ్రైవర్ కావాలని భావించేవారు సంబంధిత అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేజర్-జనరల్ తలాల్ మారాఫియర్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్ ఖాదర్ షాబన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది.

ఆర్టికల్ 20 కింద ఉద్యోగుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా కువైట్ ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. అలాగే రోడ్లపై రద్దీ తగ్గుతుందని ఆశిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com