షీషా కేఫ్‌లపై నిషేధం విధించే యోచనలో అధికారులు
- December 08, 2019
షీషా కేఫ్‌లో ప్రైవేట్ గదులకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది. కేఫ్ లో క్లోజ్డ్ రూమ్స్‌లపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. పారిశ్రమ, పర్యాటక శాఖ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించటంపై కసరత్తు చేస్తోంది. షీషా కేఫ్‌లో కొన్ని క్లోజ్డ్ వీఐపీ రూమ్స్ ఉంటాయి. పూర్తి ప్రైవసీ కోరుకునే వారు వీటిని అద్దెకు ఇస్తారు.
అయితే..పలు కారణాలతో షీషా కేఫ్ లో ఉండే ఈ ప్రైవసి గదులపై ఆరోగ్య మంత్రిత్వశాఖ నిషేధం విధించే యోచనలో ఉంది. ప్రధానంగా యువత ఈ క్లోజ్డ్ రూమ్స్ లో అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే..షీషా కల్చర్‌పై ఉక్కుపాదం మోపేలా త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రాబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనసమర్దక ప్రాంతాలు, ఫుట్ పాత్ లు, ప్రార్థన స్థలాల్లో షీషాలను అందించే వారికి శిక్ష విధించేలా కొత్త చట్టం ఉండబోతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!