కువైట్ః ప్రభుత్వ శాఖలో నిధుల దుర్వినియోగంపై విచారణ

- December 09, 2019 , by Maagulf
కువైట్ః ప్రభుత్వ శాఖలో నిధుల దుర్వినియోగంపై విచారణ

కువైట్ఃమంత్రిత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై పార్లమెంట్ బడ్జెట్‌&ఫైనాన్స్‌ అకౌంట్స్‌ కమిటీ  ఫోకస్‌ చేసింది. అవినీతి ఆరోపణలపై నిజానిజాలు ఏమిటో తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని నియమించినట్లు స్థానిక దినపత్రిక అల్‌-ఖబాస్‌ తెలిపింది. ప్రభుత్వ శాఖల్లో అపాయింట్మెంట్  సంబంధిత వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు స్టేట్ ఆడిట్ బ్యూరో పరిశీలనలో ఇప్పటికే వెల్లడైనట్లు తన కథనంలో వివరించింది. ఇప్పుడు ఆ ఆరోపణలపైనే నిజనిర్ధారణ కమిటీ విచారణ జరపనున్నట్లు అల్-ఖబాస్‌ డైలీ వెల్లడించింది.

అవినీతికి పాల్పడినట్లు అనుమానిస్తున్న సంబంధిత మంత్రులకు నిజ నిర్ధారణ కమిటీ ఇప్పటికే లేఖలు పంపించింది. కమిటీ రాసిన లేఖల ప్రకారం..అపాయింట్మెంట్ సంబంధిత అక్రమాలతో పాటు రాయితీలు, ఆర్ధిక ప్రయోజనాలు పొందెందుకు అక్రమ మార్గాలను అనుసరించిటన్లు వివిధ మంత్రిత్వ శాఖలపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి ప్రయాణాల రాయితీల్లోనూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే..ఆయా మంత్రిత్వ శాఖలపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ..నిబంధనలు అతిక్రమించి నిధుల దుర్వినియోగం చేయటానికి గల కారణాలు ఏమిటో తెలుపాలంటూ కమిటీ తమ లేఖలో వివరణ కోరింది. ఇదే విషయంలో సివిల్ సర్వీస్‌ కమిషన్‌-CSC ప్రతినిధులను పంపిస్తే ఎందుకు స్పందించలేదో కూడా వివరణ ఇవ్వాలని అడిగింది. లేఖలపై మంత్రిత్వ శాఖలు స్పందించిన తర్వాత ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్‌ కార్యచరణపై సమీక్షించుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఇదిలాఉంటే..ఆర్ధిక వ్యవహారాల శాఖ మంత్రి మరియ అల్‌-అఖీల్‌ కమిటీ పంపించిన లేఖ అందుకున్నవారిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com