బహ్రెయిన్:రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ళ చిన్నారి మృతి
- December 11, 2019
బహ్రెయిన్:ఘోర రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ళ బహ్రెయినీ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నార్తరన్ గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24వ గల్ఫ్ కప్‌ని బహ్రెయిన్ సొంతం చేసుకున్న దరిమిలా తోటి చిన్నారులతో కలిసి బైక్‌పై సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో మరో చిన్నారికి గాయాలయ్యాయి. సైకిల్స్‌పై చిన్నారులు వెళుతుండగా, 19 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి నడుపుతున్న కారు వీరిని ఢీకొంది. ఈ ఘటనలో 13 ఏళ్ళ బహ్రెయినీ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. గాయపడ్డ మరో బాలుడికి వైద్య చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం