అన్నా చెల్లెళ్ల తిట్లపురాణం.. కోర్టుకెక్కిన వివాదం

- December 11, 2019 , by Maagulf
అన్నా చెల్లెళ్ల తిట్లపురాణం.. కోర్టుకెక్కిన వివాదం

యూఏఈలో అరబ్ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు బండ బూతులు తిట్టుకున్న వ్యవహారం రైస్ అల్ ఖైమా కోర్టుకు చేరింది. కోర్టు రికార్డుల ప్రకారం తమ సోదరుడి మృతి తర్వాత ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు అసభ్యకర  పదజాలంతో తిట్టుకొని పరస్పరం అవమానించుకున్నారు. అన్నయ్య తన చెల్లిని బెదిరించినట్లుగా కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది.

అయితే కుటుంబ వ్యవహారం కావటంతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని రస్ అల్ ఖైమా కోర్టు చీఫ్ జస్టిస్ పాతి అల్ ఖల్లా సూచించారు. కానీ, సోదరుడు మాత్రం కేసు విషయంలో వెనక్కి తగ్గటం లేదు. అతని మరో సోదరి కూడా కేసు వాపసు తీసుకోమని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అన్నయ్య అనే గౌరవం లేకుండా తనను అవమానించిన తన చెల్లికి తగిన శాస్తి జరగాల్సిందేనని పట్టుబట్టాడు. తాను ఆమెను బెదిరించ లేదని, అభ్యంతరకర పదాలు వాడలేదని అంటున్నాడు. మరోవైపు సోదరి మాత్రం తన అన్నయ్యే తనను అసభ్యకర పదజాలంతో దూషించాడని  ఆరోపించింది. అయినా తాను స్పందించి లేదని విన్నవించింది. దీంతో న్యాయస్థానం ఇద్దరిని తప్పుబట్టింది. యూఏఈ ఈ ఏడాదిని ఇయర్ ఆఫ్ టోలరెన్స్ గా పాటిస్తున్న సందర్భంగా సహనశీల మార్గంలో వివాదాన్ని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అవటంతో విచారణ కొనసాగించి తీర్పు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com