అసద్, ఆనమ్ ల పెళ్లి.... తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం
- December 11, 2019


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లి సందడి మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనమ్ పెళ్లి జ రుగుతోంది. ఇప్పటికే... ఈ పెళ్లికి సంబంధించిన సంబరాలు మొదలయ్యాయి. కాగా వీరి పెళ్లి రిసెప్షన్ కి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అజారుద్దీన్, ఆయన కుమారుడు అసద్, సానియా మీర్జా, ఆమె సోదరి ఆనమ్ మీర్జా... నలుగురు వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ని పెళ్లి రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటితోపాటు.. ఆనమ్, అసద్ ల మెహందీ పంక్షన్ కి సంబంధించిన ఫోటోలను ఇప్పటికే ఆనమ్, సానియాలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫోటోల్లో ఆనమ్ ఎంతో అందంగా ఉంది. రెండు చేతులకు మెహందీ పెట్టుకొని..డిజైనర్ వేర్ లంగావోణీ వేసుకుంది. పక్కనే సానియా మీర్జా కూడా ఉంది. సానియా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించారు. కాగా... ఇప్పుడు వీరి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డ్రస్ లో ఆనం చాలా అందంగా ఉన్నావంటూ కొందరు మెరిసిపోతున్నావంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఫోటోకి 8వేలకు పైగా లైకులు.. వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా.. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో వారు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ వారం వీరి పెళ్లి జరగనుంది.
స్టైలిస్ట్ అయిన ఆనంమీర్జా న్యాయవాది అయిన అసద్ ను వివాహమాడనుంది. ఆనంమీర్జా కూడా తన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘మంచి స్నేహితులైన కుటుంబసభ్యులను పొందుతుండటం నాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది’’ అని ఆనంమీర్జా వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ కుమారుడు అసద్ తో తన చెల్లెలు ఆనంమీర్జా పెళ్లి అని సానియా మీర్జా అక్టోబరు నెలలో ప్రకటించారు.ఈ పెళ్లితో రెండు క్రీడా కుటుంబాలైన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు బంధువులు కానున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







