ఇస్లాంను అవమానించారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురు శ్రీలంకన్లు

- December 12, 2019 , by Maagulf
ఇస్లాంను అవమానించారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురు శ్రీలంకన్లు

దుబాయ్:ఇస్లాం మతాన్ని అవమానించారంటూ దుబాయ్ లో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న ముగ్గురు శ్రీలంకన్ల కేసులో బుధవారం దుబాయ్ కోర్టు విచారణ చేపట్టింది. గత మేలో శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి  ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఇస్లాం మతాన్ని అవమానించారనేది  నిందితులపై ఉన్న ఆరోపణ.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం పేలుళ్ళు జరిగిన వారం తరువాత సోషల్ మీడియాలో అవమానకర చిత్రాలు, టెక్స్ట్ పోస్ట్ చేసిన ముగ్గురు నిందితులు వయస్సు 28 నుంచి 34 మధ్య ఉంటుంది. పామ్ జుమైర్హ్  లోని లగ్జరీ హోటల్ లో ఈ ముగ్గురు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. నిందితుల సహోద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో గత మేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అల్ బర్షా పోలీసులు వెంటనే నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళు ఉండే రూంని తనిఖీ చేశారు. ల్యాప్ ట్యాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

హోటల్ లోని పాకిస్తాన్ ఉద్యోగి  చెప్పిన అధికారిక వివరాల ప్రకారం" హోటల్ లో మాతో పాటు 84 దేశాలకు చెందినవారు పని చేస్తున్నారు.  నిందితులు ఫేస్ బుక్ లో ఇస్లాంను అవమానించినట్లు కొందరు సహోద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అంతర్గత విచారణ నిమిత్తం వాళ్ళకు సామాన్లు జారీ చేశాం".

అయితే శ్రీలంకన్లు మాత్రం తమపై నమోదైన ఆరోపణలు అసత్యమని అంటున్నారు. తమ దేశంలో పేలుళ్ళకు పాల్పడిన ఉగ్రవాదం పై మాత్రమే పోస్టులు పెట్టామని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ కేసులో డిసెంబర్ 22న తీర్పు రానుంది. అంతవరకు నిందితుల కస్టడీ కొనసాగనుంది. 

ఈ ఏడాది గత మేలో శ్రీలంకలోని హోటళ్ళు, చర్చీలు లక్షంగా జరిగిన ఉగ్రదాడుల్లో 40 మంది విదేశీయులతో సహా 250 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com