యూఏఈలో తొలిసారిగా అన్ లిమిటెడ్ ప్లాన్ ప్రకటించిన ఎటిసలాట్

- December 12, 2019 , by Maagulf
యూఏఈలో తొలిసారిగా అన్ లిమిటెడ్ ప్లాన్ ప్రకటించిన ఎటిసలాట్

యూఏఈలో ప్రముఖ మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీ ఎటిసలాట్ మునుపెన్నడు లేని విధంగా ప్రొఫెషనల్స్, బిజినెస్ ఎగ్జిక్యూటీవ్స్ కోసం కొత్త ప్లాన్ లను ప్రకటించింది. అపరిమితంగా ఇంటర్నేషనల్, లోకల్ కాల్స్ చేసుకునేల పలు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ అన్ లిమిటెడ్' ప్లాన్ పేరుతో పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ఇటీవలె ప్రకటించిన అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్, లోకల్ కాల్స్ ప్లాన్ విజయవంతం కావటంతో ప్రస్తుతం ఈ కొత్త ప్యాకేజీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'బిజినెస్ ఇన్ఫినెట్' ప్లాన్ కొనుగోలు చేసిన పోస్ట్ పెయినడ్ వినియోగదారులు యూఏఈతో పాటు అంతర్జాతీయంగా అపరిమిత కాల్స్ సౌకర్యం పొందవచ్చు. సమయం ఆదా చేసుకోవటంతో పాటు వ్యాపార అభివృద్ధికి తమ కొత్త ప్యాకేజీలు దోహదం చేస్తాయని ఎటిసలట్ గ్రూప్ సంస్థల చీఫ్ బిజినెస్ అఫీసర్ సల్వడర్ అంగ్లాడ అన్నారు. ప్లాన్ ధర పెరుగుతున్న కొద్ది ఉచిత రోమింగ్ సమయం, డేటా ప్యాకేజీలు మారుతాయని తెలిపారు. హై ఎండ్ రెంటల్ ప్లాన్ లో చేరినవారికి గోల్డ్ వీఐపీ నెంబర్ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. 

ఎటిసలట్ ప్రకటించిన పోస్ట్ పెయిడ్ ప్యాకేజీల ధరల వివరాలు:
350 దిర్హమ్, 600 దిర్హమ్ ప్లాన్- అన్ లిమిటెడ్ లోకల్, ఇంటర్నేషనల్ కాల్స్. 

900 దిర్హమ్ ప్లాన్ - 500 ఇన్ కమింగ్ కాల్స్, 100 ఔట్ గోయింగ్ కాల్స్, 100 జీబీ వరకు నేషనల్ డేటా, 1 జీబీ రోమింగ్ డేటా.

1200 దిర్హమ్ ప్లాన్- 1000 ఇన్ కమింగ్, 200 ఔట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ వరకు ఉచితం. 125 జీబీ నేషనల్ డేటా, 2 జీబీ రోమింగ్ డేటా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com