5వ జెడ్డా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం

- December 12, 2019 , by Maagulf
5వ జెడ్డా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం

జెడ్డా: మక్కా గవర్నర్‌ ప్రిన్స్‌ ఖాలిద్‌ అల్‌ ఫైసల్‌, ఐదవ ఎడిషన్‌ జెడ్డా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ని ప్రారంభించారు. 40 దేశాల నుంచి వచ్చిన 400 పబ్లిషింగ్‌ హౌస్‌లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి. జెడ్డా గవర్నర్‌ అలాగే ఎగ్జిబిషన్‌ హయ్యర్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రిన్స్‌ మిషాల్‌ బిన్‌ మాజెద్‌ ఈ సందర్భంగా ప్రిన్స్‌ ఖాలిద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మక్కా డిప్యూటీ గవర్నర్‌ ప్రిన్స్‌ బదర్‌ బిన్‌ సుల్తాన్‌, మక్కా గవర్నర్‌ అడ్వయిజర్‌ ప్రిన్స్‌ సౌద్‌ బిన్‌ అబ్దుల్లా, జెడ్డా డిప్యూటీ గవర్నర్‌ ప్రిన్స్‌ ఖాలిద్‌ బిన్‌ మిషాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్‌ 21 వరకు పలు ఈవెంట్స్‌తో ఈ బుక్‌ ఫెయిర్‌ కొనసాగుతుంది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com