సోషల్ మీడియా సర్వీసులు పొందేందుకు షార్జాలో కొత్త నిబంధనలు
- December 13, 2019
ప్రకటనలు, ఇతర ప్రచారాలకు సంబంధించి సోషల్ మీడియా సర్వీసులను పొందాలనుకునే ప్రభుత్వ శాఖలకు షార్జా ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. షార్జాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఇక నుంచి తప్పనిసరిగా షార్జా మీడియా ఆఫీస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు షార్జా యువరాజు, షార్జా ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖస్సిమి డిక్రీ నెం.39, 2019ని జారీ చేశారు. ఈ తీర్మానం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వంలోని స్వతంత్ర సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ అనుంబంధంగా నిర్వహిస్తున్న కంపెనీలు అన్ని కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ప్రకటనలు, ప్రచార సేవలను పొందే కాంట్రాక్ట్ లు పేయిడ్ అయినా నాన్ పెయిడ్ అయినా సరే ముందస్తుగా షార్జా మీడియా
సోషల్ మీడియా నిర్వాహకులతో ఒప్పందం చేసుకునే ముందే షార్జా మీడియా ఆఫీస్ నుంచి పారిపాలన అనుమతులు తీసుకోవాలి. ఈ కొత్త నిబంధన ఈ నెల 4 నుంచే అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







