దుబాయ్: కడుపులో డ్రగ్స్..తల్లిదండ్రులు, కొడుకు అరెస్ట్
- December 13, 2019
డ్రగ్స్ సరఫరా చేస్తున్న కుటుంబం దుబాయ్ విమానాశ్రయంలో పట్టుబడింది. కడుపులో నిషేధిత నార్కొటిక్స్ దాచుకొని ఎయిర్ పోర్ట్ దాటించేందుకు ప్రయత్నించారని దుబాయ్ నార్కొటిక్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చీఫ్ సాలెహ్ అహ్మద్ అల్-షెహి తెలిపారు. తల్లిదండ్రులతో పాటు కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ఇటీవలి కాలంలో డ్రగ్స్ డీలర్లు అవలభిస్తున్న టెక్నిక్ లు సవాల్ గా మారుతున్నాయని అన్నారు. దేశం వెలుపలే ఉండి స్మగ్లింగ్ నెట్వర్క్ నడిపిస్తుండటంతో వారిని పట్టుకోవటం కష్టంగా మారిందన్నారు. కొనుగోలుదారులను నేరుగా కలుసుకోకుండా ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నారని సాలెహ్ అహ్మద్ అల్-షెహి పేర్కొన్నారు.
మానవహక్కుల ఉల్లంఘన, ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే డ్రగ్స్ సరఫరాను దుబాయ్ ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణిస్తుంది. శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన కుటుంబ సభ్యులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. శుక్రవారం కేసు విచారణకు రానుంది. దాదాపు పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!