పాస్‌పోర్టులపై కమలం గుర్తు
- December 13, 2019
న్యూఢిల్లీ: కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకే కమలం చిహ్నాన్ని ముద్రించినట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. కేరళలోని కోజికోడ్‌లో లోటస్ గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తారు. కమలం బీజేపీ గుర్తు కనుక ఇలా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రవీష్ కుమార్ ఆయన ఆరోపణలను కొట్టిపడేశారు. నకిలీ పాస్‌పోర్టులను గుర్తించడంతోపాటు భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే కమలం గుర్తును ముద్రించామని, అది మన జాతీయ చిహ్నమని పేర్కొన్నారు. అది ఒక్క కమలం గుర్తుతో ఆగిపోదని, ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్ధతిలో పాస్‌పోర్టులపై ముద్రిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







