హైదరాబాద్:హెచ్1బీ ఇప్పిస్తానంటూ మోసం..
- December 13, 2019
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమీర్‌పేట డివిజన్లో సాఫ్ట్వేర్ సంస్థల నిర్వాహకుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా వెళ్లేందుకు హెచ్1బీ వీసా ఇప్పిస్తానని చెప్పి రూ. 3 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు ఓ సంస్థ నిర్వాహకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్ నగర్లో నివసిస్తున్న టెక్నికల్ ఆర్కిటెక్ట్ యామినీ భాస్కర్‌రావు అమెరికా వెళ్లేందుకు అమీర్‌పేటలో ఉన్న ఎక్సెల్ సాఫ్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు రోసారియో మాథ్యూ్‌సను కలిశారు.
హెచ్1బి వీసా కావాలంటే ముందుగా రూ. 3 లక్షల చెల్లించాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన భాస్కర్‌రావు మాథ్యూస్ ఖాతాకు నగదు బదిలీ చేశారు. మొదటి ఫేజ్ ఇంటర్వ్యూ, పరీక్ష పూర్తయింది. రెండో ఫేజ్ దాటేందుకు రోసారియో వద్దకు వెళ్లగా.. స్కిల్ డెవల్‌పమెంట్ సరిగా లేదని, హెచ్1బి వీసా రావడం కష్టమని చెప్పాడు. బాధితుడు అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో భాస్కర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు నుంచి ఎస్ఆర్నగర్ పోలీసులకు రిజిస్టర్ పోస్టులో లేఖ అందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సెక్టార్ ఎస్ఐ సాయినాథ్ తెలిపారు
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!