బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ చరిత్రాత్మక విజయం

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ చరిత్రాత్మక  విజయం

లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 650 స్థానాలకు గాను కన్జర్వేటివ్ పార్టీ 364 సీట్లను, లేబర్ పార్టీ 203 సీట్లను గెలుపొందాయి. వీటితో పాటు ఎస్‌ఎన్‌పీ 48 సీట్లు, ఇతరులు 34 సీట్లు కైవసం చేసుకున్నారు. మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన 326 సీట్లను దక్కించుకున్న కన్జర్వేటివ్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టనుంది. కాగా, బ్రెగ్జిట్‌పై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికార పార్టీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో.. బోరిస్ జాన్సన్ వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ 203 సీట్లకే పరిమితమవడంతో.. లేబర్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు జెరెమి కార్బిన్ రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

Back to Top