దుబాయ్ లో రజనీకాంత్ ఫీవర్..70 కేకులతో ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్స్

దుబాయ్ లో రజనీకాంత్ ఫీవర్..70 కేకులతో ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్స్

దుబాయ్:తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తలైవా నటించిన మూవీస్ ఫారెన్ కంట్రీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు యూఏఈకి కూడా రజనీకాంత్ మేనియా విస్తరించింది. ఏకంగా రజనీకాంత్ థీమ్ తోనే ఆయన ఫ్యాన్ సవితా జయరాం హోటల్ ను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మన్కూల్ లోని దుబాయ్స్ రాయల్ అస్కాట్ హోటల్‌లో ఈటరీ రజనీకాంత్ 24/7 ఓపెన్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ 70వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిడ్ నైట్  70 బటర్ స్కాచ్ కేకులను కట్ చేసి అతిథులకు పంచిపెట్టారు.

దక్షిణాది స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలు స్వదేశంలో ఘనంగా జరుపుకోవటం సాధారణమే. అయితే..ఇలా దుబాయ్ లోనూ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించటం తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ కు నిదర్శనం. నిజానికి సూపర్ స్టార్ పుట్టినరోజు సంబరాలను తాము ఇంత ఘనంగా ప్లాన్ చేయలేదని హోటల్ నిర్వాహకురాలు సవితా జయరాం అన్నారు. కానీ, టైం అర్ధరాత్రి పన్నెండు కాగానే అతిథులు ఎక్కడలేని జోష్ తో సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారని, డ్యాన్స్ లు చేస్తూ హంగామా సృష్టించారని ఆమె చెప్పారు. అయినా..పార్టీ సజావుగా జరిగిందన్నారు.

"బుధవారం రాత్రి 10గం.లకు సెలబ్రేషన్స్ ప్రారంభమై 1.30గం.ల వరకు కొనసాగాయి. రజనీకాంత్ సినిమా ప్రదర్శించాము. రజనీకాంత్ మాస్క్ లు, కానుకలు పంచాము. వీధి చిత్రకారుడు ఆరు నిమిషాల్లో రజనీకాంత్ చిత్రపటాన్ని వేసి అతిథులను అలరించాడు. సెలబ్రేషన్స్ కు ఎంతమంది వచ్చారో సరిగ్గా గుర్తుకు లేకున్నా.. దాదాపు 270 కానుకలను డిస్ట్రిబ్యూట్ చేశాం" అని సవితా జయరాం తెలిపారు. హోటల్ ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదని, పైగా వర్కింగ్ డేస్ అయినా సెలబ్రేషన్స్ కి పెద్ద సంఖ్యలో అతిథులు రావటం అశ్చర్యం కలిగించిందన్నారు. రజనీకాంత్ మమ్మల్ని అందర్ని ఒక చోటకు చేర్చారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

రజనీకాంత్ వీరాభిమానిగా సవితా జయరాం ఆయన థీమ్ తో ప్రారంభించిన హోటల్.. ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అనుమానంగానే ఉండేది. ముఖ్యంగా విదేశాలలో ఇలాంటి థీమ్ వర్కౌట్ అవుతుందనే నమ్మకం లేదు. అయితే...దుబాయ్ లో రజనీకాంత్ కు ఓ హోటల్ డెడికేట్ చేశారనే
విషయం సౌత్ ఇండియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయం రజనీకాంత్ వరకు వెళ్లటంతో ఇంప్రెస్ అయిన సూపర్ స్టార్ సవితా జయరాంను కలుసుకోవాలని ఉందని తానే స్వయంగా కోరటం విశేషం.  

మీ అభిమాన హీరోని కలుసువోటం ఎలా ఉందని? ప్రశ్నకు స్పందించిన సవితా జయరాం అవధుల్లేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన్ని కలుసుకునే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని అన్నారామె. ఆయనతో సమావేశం మరిచిపోలేని క్షణాలని, మాటల్లో వర్ణించలేనని తన అనుభూతిని మా గల్ఫ్ తో పంచుకున్నారు.

Back to Top