ఖతార్‌ క్యాన్సర్‌ సొసైటీకి లులు గ్రూప్‌ భారీ విరాళం

ఖతార్‌ క్యాన్సర్‌ సొసైటీకి లులు గ్రూప్‌ భారీ విరాళం

లులు హైపర్‌ మార్కెట్‌, ఖతార్‌ క్యాన్సర్‌ సొసైటీ (క్యుసిఎస్‌)కి 100,000 ఖతారీ రియాల్స్‌ విరాళాన్ని డొనేట్‌ చేసింది. 'షాప్‌ అండ్‌ డొనేట్‌' పేరుతో చేపట్టిన క్యాంపెయిన్‌ సందర్భంగా వచ్చిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని డొనేట్‌ చేయడం జరిగింది. తమ సేల్స్‌ ద్వారా వచ్చిన మొత్తం నుంచి కొంత మొత్తాన్ని క్యాన్సర్‌ సొసైటీకి అందించనున్నట్లు పేర్కొంటూ అక్టోబర్‌లో ఈ మేరకు సేల్స్‌ని ప్రకటించింది లులు గ్రూప్‌. ఖతార్‌ నేషనల్‌ విజన్‌ 2030కి అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. క్యుసిఎస్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డెరా అల్‌ దోసారి మాట్లాడుతూ, వ్యక్తులు, సంస్థలు ఈ స్థాయిలో స్పందించడం అభినందనీయమని అన్నారు. కాగా, అక్టోబర్‌ అంతటా లులు బ్రాంచ్‌లలో సిబ్బంది పింక్‌ రిబ్బన్‌లు ధరించి, బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Back to Top