ఖతార్ క్యాన్సర్ సొసైటీకి లులు గ్రూప్ భారీ విరాళం
- December 13, 2019
లులు హైపర్ మార్కెట్, ఖతార్ క్యాన్సర్ సొసైటీ (క్యుసిఎస్)కి 100,000 ఖతారీ రియాల్స్ విరాళాన్ని డొనేట్ చేసింది. 'షాప్ అండ్ డొనేట్' పేరుతో చేపట్టిన క్యాంపెయిన్ సందర్భంగా వచ్చిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని డొనేట్ చేయడం జరిగింది. తమ సేల్స్ ద్వారా వచ్చిన మొత్తం నుంచి కొంత మొత్తాన్ని క్యాన్సర్ సొసైటీకి అందించనున్నట్లు పేర్కొంటూ అక్టోబర్‌లో ఈ మేరకు సేల్స్‌ని ప్రకటించింది లులు గ్రూప్. ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. క్యుసిఎస్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ డెరా అల్ దోసారి మాట్లాడుతూ, వ్యక్తులు, సంస్థలు ఈ స్థాయిలో స్పందించడం అభినందనీయమని అన్నారు. కాగా, అక్టోబర్ అంతటా లులు బ్రాంచ్‌లలో సిబ్బంది పింక్ రిబ్బన్లు ధరించి, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!