సోషల్ మీడియా వేదికగా సమాజ స్ఫూర్తి..అబుదాబిలో వినూత్న ప్రయత్నం

- December 14, 2019 , by Maagulf
సోషల్ మీడియా వేదికగా సమాజ స్ఫూర్తి..అబుదాబిలో వినూత్న ప్రయత్నం

నేటి సమాజంపై సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకి పెరిగిపోతూ వస్తోంది. ఆ సోషల్ మీడియానే వేదికగా చేసుకొని యువతలో సమాజ స్పూర్తి పెంపొందించేలా అబుదాబి ప్రభుత్వం వినూత్న ప్రయత్నం ప్రారంభించింది. 'అబుదాబి స్టోరి' పేరుతో కమ్యూనిటీ స్పిరిట్ పెంచేలా సోషల్ మీడియా ఛానెల్ ను అబుదాబి గవర్నమెంట్ మీడియా ఆఫీస్-ADGMO లాంచ్ చేసింది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వేదిక యువతకు చిన్నారుల్లో స్ఫూర్తి నింపే కథలు ప్రసారం అవుతాయి. అబుదాబి విభిన్న సంస్కృతి చాటిచెప్పేలా, సమాజంలో నైతిక విలువలను పెంపొందించేలా ఈ సోషల్ మీడియా ప్రసారాలు ఉంటాయి. వివిధ సంస్కృతుల సమ్మేళనం, సమాజంలోని వైవిద్య జీవనానికి సంబంధించి కథలు, కథనాలు ఉంటాయి. వీటికి తోడు అబుదాబి నివాసులు తమకు ఇష్టమైన ప్రదేశాలను ఈ సోషల్ మీడియా వేదికగా పంచుకోవచ్చు.

విద్యావేత్త డోరియన్ రోజర్స్ రూఫ్ టాప్ రిథమ్స్ తో తొలి ఫీచర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా ప్రసారం చేశారు. అలాగే అహ్మద్ అల్ బలౌషి సందేశాలను కూడా ప్రసారం చేయబోతున్నారు.  ఉప ప్రధానమంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రొత్సహంతో అహ్మద్ అల్ బలౌషి  మ్యూజియం రంగాన్ని కేరీర్ గా మలుచుకున్నారు. ప్రస్తుతం లౌవ్రే అబుదాబిలో పనిచేస్తున్న అల్ బలూషి..యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అబుదాబి స్టోరి ద్వారా ఆయన యువతకు సందేశాలు ఇవ్వనున్నారు. దయ, జాలి ప్రయోజనాలను చాటిచెబుతూ విస్తృత సమాజానికి దోహదం చేసే కమ్యూనిటీ సభ్యులు కూడా తమ ప్రవచనాలు ఇవ్వనున్నారు. అలాగే  ప్రజలకు నిర్ణయాత్మకమైన సమగ్ర వినోద కార్యకలాపాలను అందించే సంస్థ 'గోల్స్ యూఏఈ'ని స్థాపించిన ఖవ్లా బార్లీతో కూడా షోలు ప్లాన్ చేశారు.

సమాజంలో ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రేరణ పొందించే వ్యక్తుల కథనాలు, అబుదాబి సమాజం, ప్రదేశాలే ప్రామణికంగా ఛానెల్ నిర్వహణ ఉంటుందని ADGMO డైరెక్టర్ జనరల్ మర్యం ఈద్ అల్ మెహైరీ తెలిపారు. మనం ఏమిటీ? మన ఏం నమ్ముతున్నాం? మన లక్ష్యాలు ఏంటో అబుదాబి స్టోరి ద్వారా సమాజానికి తెలియజేస్తామని ADGMO డైరెక్టర్ జనరల్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com