గోపీచంద్, సంపత్‌నంది కాంబినేషన్ లో కొత్త సినిమా
- December 14, 2019_1576342471.jpg)
హైదరాబాద్:మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో.. 'యుటర్న్'వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం అయింది. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా మరో హీరోయిన్గా దిగంగన సూర్యవంశీ నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ''మా బేనర్లో గోపీచంద్, సంపత్‌నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు(శనివారం) నుంచి ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్‌గా అజిజ్నగర్లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. గోపీచంద్ కెరీర్లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. మా బేనర్‌కి మరో ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. గోపీచంద్ సరసన తమన్నా నటిస్తుండగా మరో హీరోయిన్గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మొదటి షెడ్యూల్ అనంతరం కంటిన్యూగా రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూల్స్ పూర్తి చేసి ఈ సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..