యూఏఈ: ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలు..వీడియో షేర్ చేసిన పోలీసులు
- December 18, 2019
యూఏఈ:వాహనదారులు హద్దు దాటిన వేగంతో కార్లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యూఏఈ పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు కారు డ్రైవర్లు సృష్టించిన బీభత్సాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేశారు. ఫోర్ వీలర్ జీఎంసీ, నిస్సాన్ SUV ఫాస్ట్ లేన్ పై ఒకదానికి
ఒకటి పోటీ అన్నట్లుగా పిక్ అప్ పెంచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు షేర్ చేసిన వీడియోలో స్పష్టమవుతోంది. ఫాస్ట్ లైన్ రోడ్డపై దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో అత్యంత ప్రమాదకరంగా వాహనాలను నడుపుతూ ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేస్తూ వెళ్లిపోయారు. అంతేకాదు స్పీడ్ ను అలాగే కంటిన్యూ చేసిన వాహనదారులు సైడ్ బై సైడ్ వెళ్తూ ఒకరినొకరు తిట్టుకున్నట్లు వీడియోలో ద్వారా తెలుస్తోంది. హద్దు దాటిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ మీ ప్రాణాలు, ఇతర వాహనదారుల ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాగే వెహికిల్స్ ని పక్క పక్కనే కాకుండా రెండు వాహనాల మధ్య స్పేస్ మేయిన్టేన్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







