ఢిల్లీ:నిర్భయ నిందితుల పిటిషన్ తిరస్కరణ
- December 18, 2019
ఢిల్లీ:నిర్భయ కేసులో దోషులకు సమీక్ష కోరే హక్కు లేదని, క్షమాభిక్షకు కూడా అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. క్షమించరాని నేరం చేసిన వాళ్లు.. ఇప్పుడు రివ్యూ కోరడానికి అర్హులు కారని చెప్పింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు గతంలోనే సుప్రీం ఉరి శిక్ష వేసింది. రివ్యూ పిటిషన్లు కూడా ఇప్పుడు కొట్టేసిన నేపథ్యంలో.. త్వరలో శిక్ష అమలు ఖాయంగా కనిపిస్తోంది. ఐతే, అక్షయ్ సింగ్ తరపున వాదించిన అడ్వొకేట్ దీనిపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. నిర్భయ తల్లిదండ్రులు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!