షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం

- December 19, 2019 , by Maagulf
షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం

పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కు విరుగుడుగా షార్జా రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బుధవారం ప్రారంభించింది. తొలిగా ఆరు నెలల పాటు ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సును ట్రయల్ చేసిన తర్వాత మరిన్ని సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా షాంగన్ బస్ సంస్థకు చెందిన దుబాయ్ ఏజెంట్ రిలయన్స్ మోటర్స్ తో ఈ మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రారంభమైన ఎలక్ట్రిక్ బస్సు షార్జాలోని అల్ జుబెల్ బస్టాండ్ నుంచి అజ్మన్ లోని అల్ ముసల్లా బస్ స్టేషన్ కు వెళ్తుంది. ఈ బస్సులో 27 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 30 మంది వరకు నిల్చొవచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఆకుపచ్చని రంగులో ఉన్న ఈ బస్సులో బస్సు డ్రైవర్ సీటుకు ఓ ప్రత్యేక ఉంది. డ్రైవర్ కాకుండా ఇంకెవరు కూర్చున్న బస్సు ముందుకు కదలకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు కూడా ఓ పద్దతిలో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ మేరకు డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.

రోజురోజుకు పోరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయటంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని SRTA చైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com