రోజంతా నాన్ స్టాప్ గా మెట్రో సర్వీసులు: న్యూఇయర్ షెడ్యూల్ ప్రకటించిన దుబాయ్ మెట్రో
- December 19, 2019
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికుల కోసం మెట్రో సర్వీసు సమయాన్ని దుబాయ్ మెట్రో పొడగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెడ్ లైన్, గ్రీన్ లైన్ రూట్లలో డిసెంబర్ 31, జనవరి 1న 24 గంటల పాటు మెట్రో ట్రైన్స్ నడుపుతున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇక ఈ నెల 27న రషిదియా-DMCC స్టేషన్స్ మధ్య మెట్రో ట్రైన్లు ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గ్రీన్ లైన్ కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక జనవరి 2న రెడ్ లైన్ రూట్లో ఉదయం 5 గంటల నుంచి ఫస్ట్ మెట్రో రైలు స్టార్ట్ అవుతంది. గ్రీన్ లైన్ రూట్లో మాత్రం 5.30 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజాము 3.30 గంటల వరకు సర్వీసు అందించనుంది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లే వారు ఫ్లైట్ సమయానికి మూడు నాలుగు గంటల ముందే బయలుదేరాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







