బహ్రెయిన్:ముగిసిన ఐఎస్‌బి మెగా ఫెయిర్‌ 2019

- December 19, 2019 , by Maagulf
బహ్రెయిన్:ముగిసిన ఐఎస్‌బి మెగా ఫెయిర్‌ 2019

బహ్రెయిన్‌:ఇండియన్‌ స్కూల్‌ మెగా ఫెయిర్‌ 2019 ఘనంగా జరిగిన ముగింపు వేడుకలతో ముగిసింది. ఇసా టౌన్‌ కేంపస్‌లో ఈ వేడుకలు జరిగాయి. వేలాది మంది సందర్శకులు స్కూల్‌ క్యాంపస్‌లో సందడి చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వేడుకల్ని తిలకించేందుకు సందర్శకులు రావడం గమనార్హం. ఇండియన్‌ మ్యుజీషియన్‌ స్టీఫెన్‌ దేవస్సీ మరియు బాలీవుడ్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ రితూ పాఠక్‌ సంద్శకుల్ని పెప్పీ సాంగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఐఎస్‌బి ఛైర్మన్‌ ప్రిన్స్‌ ఎస్‌ నటరాజన్‌, ఇండియన్‌ స్కూల్‌ మెగా ఫెయిర్‌ సావనీర్‌ని విడుదల చేశారు. ఇండియన్‌ స్కూల్‌ విద్యార్థులు కళ్ళు చెదిరే రీతిలో వెస్టర్న్‌ మరియు అరబిక్‌ డాన్స్‌ని ప్రదర్శించడం జరిగింది. ఇండియన్‌ స్కూల్‌ టీచర్స్‌ రూపొందించిన ఫుడ్‌ స్టాల్స్‌ భోజన ప్రియుల్ని అలరించాయి. ఈ ఫెయిర్‌ ద్వారా జనరేట్‌ అయిన సొమ్ముని ఐఎస్‌బి స్టాఫ్‌ వెల్‌ఫేర్‌ కోసం వినియోగిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com