రెప్పపాటులో చావును తప్పించుకున్నాడు; కార్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

- December 20, 2019 , by Maagulf
రెప్పపాటులో చావును తప్పించుకున్నాడు; కార్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

సౌదీ అరేబియా:వెంట్రుకవాసిలో చావు తప్పిందని అంటుంటాం. సౌదీ అరేబియాలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓవర్ స్పీడుతో కంట్రోల్ తప్పిన కారును రెప్పపాటులో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియాలో ఆ షాకింగ్ వీడియో వైరల్ అయ్యింది. రియాద్ లోని ఓ రెస్టారెంట్ వెలుపల ఓ వ్యక్తి పేవ్ మెంట్ పైన  కూర్చొని ఫోన్ లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ఓ కారు అతి వేగంగా అతనివైపు దూసుకొచ్చింది. కారు సౌండ్ తో అలర్టైన ఆ వ్యక్తి సెకండ్స్ లో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు మాత్రం రెస్టారెంట్ వెలుపలి భాగాన్ని ఢీకొట్టింది. కారు బానెట్, లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com