యూఏఈ స్కాం అలర్ట్ : లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇస్తామంటూ ఫేక్ కాంపిటీషన్
- December 20, 2019
లగ్జరీ కార్లు గిఫ్ట్ గా ఇస్తామంటూ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న ఫేక్ కాంపిటీషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ యూఏఈ ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ-FCA హెచ్చరించింది. తమ కాంపిటీషన్ పాల్గొన్న వారు లగ్జరీ కార్లను గెలుచుకోవచ్చని మోసగాళ్లు అమాయకులను అట్రాక్ట్ చేస్తున్నట్లు FCA అధికారులు చెబుతున్నారు. ప్రజలను నమ్మించేందుకు కస్టమ్స్ అథారిటీ లోగో, యూఏఈలోని పాపులర్ పర్సనాలిటీ పేర్లను వాడుకున్నట్లు వివరించారు.
అంతేకాదు ఈ కాంపిటీషన్లో దేశ, విదేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్టు మోసగాళ్లు కలరింగ్ ఇస్తారు. దొంగ పేర్లతో నకిలీ పోటీదారులను సృష్టించి సోషల్ మీడియాలో ఫేక్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. అలాగే మెయిల్ కి స్పామ్ మేసేజ్ పంపించి చీటింగ్ కు పాల్పడుతారు. పోటీలో పార్టిసిపేట్ చేసిన వారు లగ్జరీ కార్ బహుమతిగా గెల్చుకునే అవకాశం ఉందంటూ ఆశలు పుట్టిస్తారు. అయితే..కారును బహుమతిగా పొందెందుకు ప్రొసిజర్ పూర్తి చేయాలని, అందుకోసం 5000 దిర్హామ్ లు చెల్లించాలని మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఫేక్ ఆన్ లైన్ కాంపిటీషన్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు లీగల్ యాక్షన్ తీసుకుంటామని FCA వెల్లడించింది.
ప్రజలు ఎవరూ ఇలాంటి నకిలీ కాంపిటీషన్లు నిర్వహించే మోసగాళ్ల మాయలో చిక్కుకోవద్దని FCA అధికారులు హెచ్చరించారు. అలాంటి వారి గురించి అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్ '@CUSTOMSUAE' సమాచారం అందించాలని సూచించారు. పర్సనల్ డీటేల్స్, బ్యాంక్ అకౌంట్ డిటేల్స్ లీక్ కాకుండా స్పామ్ మేసేజ్ లను వెంటనే డిలీట్ చేయాలని అలర్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







