సారే జహా సె అచ్చా: ఆందోళనకారులను తెలివిగా అడ్డుకొని, వారిలో దేశభక్తిని మేల్కొలిపిన పోలీసు..

- December 20, 2019 , by Maagulf
సారే జహా సె అచ్చా: ఆందోళనకారులను తెలివిగా అడ్డుకొని, వారిలో దేశభక్తిని మేల్కొలిపిన పోలీసు..

ఆందోళనను అడ్డుకునేందుకు ఈ బెంగళూరు పోలీసు లాఠీ ఛార్జ్ చేయలేదు. టియర్ గ్యాస్ వాడలేదు. దేశభక్తిని మేల్కొలిపాడు. అందరినోటి నుంచి జాతీయ గీతం పాడించాడు. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ఆందోళనకారులను శాంతింపజేశాడు. గురువారం బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ ఈ ఫీట్ చేసి అందరి మనస్సులు గెలుచుకున్నారు.

పౌరసత్వపు చట్ట సవరణ కింద దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో 144సెక్షన్‌ను సైతం అమలుచేస్తున్నారు. బెంగళూరు టౌన్ హాల్‌లో అసాంఘిక శక్తులు ఆందోళన చేయాలని పూనుకున్నారు. ఈ మేరకు పోలీసులు ఆందోళన వద్దని వెళ్లిపోవాలని కోరినా మాట వినలేదు. డీసీపీ వాళ్లకు మాటలు చెప్పారు.

దేశభక్తిని గుర్తు చేశారు. జాతీయ గీతం పాడించారు. నిజమైన దొంగలను పట్టుకోవడమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దొంగ ఎవరైనా కావచ్చు. ఎక్కడైనా ఉండి ఉండొచ్చు. మీ మధ్యలో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టేందుకు ఈ సవరణ అని హితవు తెలిపారు. మనస్సు మార్చుకున్న పౌరులతో జాతీయ గీతం సారే జహా సే అచ్చా పాడించారు. అందరినీ ప్రశాంత వాతావరణంతో చెదరగొట్టారు.

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులకు భారత్‌లో పౌరసత్వం కల్పించడమే దీని ఉద్దేశ్యం. 2014 డిసెంబరు 31కు ముందు భారత్‌లోకి ఎంటర్ అయినవారికి మాత్రమే. హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద, పార్శీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com