దుబాయ్:నగ్నంగా న్యూసెన్స్ చేసి పోలీసులపై దాడికి పాల్పడిన ఎమిరాతికి జైలు శిక్ష
- December 21, 2019
దుబాయ్ లో ఓ మహిళ ఇంట్లోకి చొరబడి నగ్నంగా న్యూసెన్స్ చేయటమే కాకుండా..పోలీసులపై దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. గత ఆగస్టులో ఫైల్ అయిన ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. గత ఆగస్టులో బుర్ దుబాయ్ లోని అరబ్ మహిళ ఇంట్లోకి చొరబడిన 21 ఏళ్ల వ్యక్తి నగ్నంగా రభస చేశాడు. మళ్లీ బయటికి వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంట్లోకి వస్తూ ఇలా రిపీటెడ్ గా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. అతని వెకిలి చేష్టలతో భయపడిపోయిన ఆ బాధితురాలు తొలుత పోలీస్ రిపోర్ట్ చేయటానికి సాహసించలేదు. అయితే..అతను పదే పదే ఇంట్లోకి వచ్చి వెళ్తుండటంతో చివరికి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితుడు దాడి చేసి ఇద్దరు పోలీసులను గాయపరిచినట్లు కోర్టుకు విన్నవించారు. ఇంజ్యూరీస్ డిటేల్స్ ని కోర్టుకు సమర్పించారు. నిందితుడు కూడా తనపై అభియోగాలను అంగీకరించటంతో కోర్టు అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..