మహాగణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా 'రామానుజన్ సంఖ్య' గురించి తెలుసుకుందాం..

- December 22, 2019 , by Maagulf
మహాగణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా 'రామానుజన్ సంఖ్య' గురించి తెలుసుకుందాం..

అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తి ప్రతిష్టలను ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేల సంవత్సరాల క్రితమే భారతీయులు వినియోగించగా.. మనదేశం నుంచి అటువంటి గొప్ప గుర్తింపు పోందిన వ్యక్తి రామానుజన్. నేడు రామానుజన్ జయంతి.

20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు రామానుజన్ జన్మించారు. పదమూడేళ్లకే ఎస్ఎల్‌లోనీ త్రికోణమితిపై రాసిన పుస్తకాన్ని ఔపోసన పట్టిన మేథావి రామానుజన్. తను సొంతంగా సిద్ధాంతాలు కూడా సృష్టించారు.

1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ హకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి (1877-1947)కి పంపారు. మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన వెంటనే రామానుజన్‌ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు.

1914 మార్చిలో లండన్‌ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. తన గణిత పరిజ్ఞానంతో భారతీయ ప్రతిభను ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట 1920 ఏప్రిల్ 26న కుంభకోణంలో కన్నుమూశారు. అయితే '1729' సంఖ్యను రామానుజన్ సంఖ్య అని ఎందుకు అంటారు అనేది ఒక ఆసక్తికర విషయం. పెద్ద పెద్ద కాంపిటేటివ్ పరిక్షల్లో(సివిల్స్, గ్రూప్స్) ఈ సంఖ్య గురించి ప్రశ్న ఉంటుంది.

రామానుజన్ చనిపోక కొన్నిరోజుల ముందు ప్రొఫెసర్ హర్టీ. రామానుజన్‌ని చూసేందుకు ఇండియాకు వచ్చాడు.. అప్పుడు హార్డీ వచ్చిన ట్యాక్సీ నంబర్ 1729. ఆ నంబర్ గురించి మాట్లాడుతూ.. ఈ నంబర్ చూడడానికి డల్‌గా ఉంది అంటాడు. అప్పుడు ఆ సంఖ్య గురించి ఆసక్తికర విషయాన్ని చెబుతాడు రామానుజన్. రెండు సంఖ్యల ఘునాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నింటి కంటే చిన్నది అని చెబుతాడు.

1729 = 13+123 = 93+103

ఇలాంటి సంఖ్యలు 50,00,000లో 101 మాత్రమే ఉన్నాయి. 1729 తరువాత ఈ విధంగా వ్రాయగలిగిన సంఖ్య 4104.

4104 = 23+163 = 93+153

1729 = 552-362 = 732-602 = 1272-1202 = 8652-8642

రెండు ఘనాల మొత్తం రెండు విధాలుగా రాయగల్గిన సహజ సంఖ్యలలో కనిష్ఠ సంఖ్య 1729

ఈ విషయాన్ని తెలుసుకున్న హార్డీ, తీవ్రమైన అనారోగ్యంతో మంచాన ఉండి కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను చెప్పిన కారణంగా ఈ సంఖ్యను రామానుజన్ సంఖ్య అని పిలుస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com