ఒమన్‌ రెస్టారెంట్స్‌లో న్యూ టూరిజం రుసుము

- December 23, 2019 , by Maagulf
ఒమన్‌ రెస్టారెంట్స్‌లో న్యూ టూరిజం రుసుము

మస్కట్‌: ఫ్రాంచైజ్‌ కాంట్రాక్టుల ద్వారా మేనేజ్‌ చేయబడుతున్న రెస్టారెంట్స్‌, అలాగే టూరిస్ట్‌ ఏరియాల్లో వుంటోన్న రెస్టారెంట్స్‌ 4 శాతం తమ అమ్మకాల నుంచి రుసుముని చెల్లించాలని మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి క్వార్టర్‌లోనూ ఈ రుసుములు చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులు వెచ్చించే మొత్తాల నుంచి దీన్ని మినిస్ట్రీకి చెల్లించాల్సి వుంటుంది. ఈ కొత్త విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం వెబ్‌సైట్‌లో పొందుపర్చబడ్డాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రుసుములు సకాలంలో చెల్లించకపోతే, తగు రీతిలో జరీమానాలు విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com