ఆరు నెలలుగా కువైట్‌ వెలుపల నివసిస్తున్న కువైటీలపై ఇన్వెస్టిగేషన్‌

- December 23, 2019 , by Maagulf
ఆరు నెలలుగా కువైట్‌ వెలుపల నివసిస్తున్న కువైటీలపై ఇన్వెస్టిగేషన్‌

కువైట్‌: స్టూడెంట్స్‌, బిజినెస్‌మేన్‌, పేషెంట్స్‌ మినహా కువైటీలు ఎవరైనా దేశం వెలుపల వరుసగా 6 నెలలు వుంటే, వారిని ఇన్వెస్టిగేషన్‌కి రిఫర్‌ చేస్తారు. విచారణలో, దేశం వెలుపల వారు ఎందుకు వుండాల్సి వచ్చిందో ప్రశ్నిస్తారు. సెక్యూరిటీ సోర్సెస్‌ ఈ మేరకు స్పష్టతనిచ్చినట్లుగా మీడియాలో కథనాలు కన్పిస్తున్నాయి. కువైట్‌ వెలుపల ఎక్కువ కాలం వుంటోన్న కువైటీ సిటిజన్స్‌, అతివాద భావజాలానికి గురవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సెక్యూరిటీ ఫోర్సెస్‌ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అలా కువైట్‌ వెలుపల ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వున్నప్పుడు, వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా వుంటే సమస్య వుండదనీ, లేదంటే క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కి వారిని రిఫర్‌ చేయడం జరుగుతందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com