UAE: యాప్ స్టోర్స్ నుంచి టు టాక్ అదృశ్యం
- December 23, 2019
యూ.ఏ.ఈ:HD వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ఫీచర్స్ తో స్వల్ప కాలంలోనే పాపులర్ అయిన 'టు టాక్' యాప్ అంతే వేగంగా కనుమరుగైపోయింది. గత శనివారం నుంచి అండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్స్ లో టు టాక్ డిస్సప్పీయర్ అయింది. దీంతో ఇక టు టాక్ సర్వీసులను పొందలేమని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. BotIM..టు టాక్ యాప్ వివరాలను ప్రకటించిన తర్వాత యాప్ కు ర్యాపిడ్ గా ఆదరణ లభించింది. అయితే..BotIM సబ్ స్క్రిప్షన్ కోసం 100 దిర్హామ్ లను ఫీగా చెల్లించాల్సి ఉంటుంది. టు టాక్ మాత్రం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా HD వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆదరణ పెరిగింది. " టు టాక్ కాల్ సర్వీస్, వీడియో క్వాలిటీ బాగుంది. టు టాక్ ను యూజ్ చేసిన వారం తర్వాత BotIM సబ్ స్క్రిప్షన్ ను క్యాన్సిల్ చేసుకున్నా" అని దుబాయ్ రెసిడెంట్ మనవ్ ప్రసాద్ అన్నారు. యూఏఈలోనే కాదు యూఎస్, యూకేలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. USA, UK లో కూడా యాప్ స్టోర్స్ లో టు టాక్ కనిపించటం లేదు. అయితే..ఇప్పటికే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా టు టాక్ సర్వీస్ ను యూజ్ చేసుకోగలుగుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!