APNRTS ద్వారా అమెరికా పాఠశాలల్లో బోధించే అవకాశం

- December 23, 2019 , by Maagulf
APNRTS ద్వారా అమెరికా పాఠశాలల్లో బోధించే అవకాశం

అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ  ఏపిఎన్ఆర్టి సొసైటీ అందించే వివిధ సేవలలో అంతర్జాతీయ నియామకాలు ఒకటి. రాష్ట్రంలో బోధనా రంగం లో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ఉపాధ్యాయులుగా బోధించే అవకాశం కల్పిస్తోంది.ఇందులో భాగంగా మొదటి విడతగా ఏపిఎన్ఆర్టిఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని స్టార్ టెక్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ  అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AGE) తో కలిసి చేపట్టిన అంతర్జాతీయ నియామకాల్లో  సెప్టెంబర్ 2019 లో 26 మంది ఉపాధ్యాయులు టెక్సాస్ లోని  ఎక్టర్ కౌంటీ  ఇండిపెండెంట్ మరియు కెర్మిట్  ఇండిపెండెంట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను గుర్తించిన అక్కడి పాఠశాల అధికారులు మరింత మంది ఉపాధ్యాయుల నియామకానికి  ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా వారు టెక్సాస్ లోని పలు జిల్లా పాఠశాలల్లో పనిచేయడానికి గణితం, సైన్సు బోధించే 50 మంది ఉపాధ్యాయుల  అవసరం  ఉందని ఏపీఎన్ఆర్టీ సొసైటీని సంప్రదించింది. ఈ క్రమం లో రెండవ విడతగా 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసే పనిలో భాగంగా ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది  ఏపిఎన్ఆర్టి సొసైటీ.

అంతర్జాతీయ ఉపాధ్యాయులుగా ఎంపిక అవడానికి … బి.ఎడ్/ఎం.ఈ.డి  కలిగి ఉండి, బోధనా రంగం లో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండాలి.  వీసా ప్రాసెస్ కొరకు టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపికైన  ఉపాధ్యాయులకు ౩ సంవత్సరాల గడువు కలిగిన J1 వీసా పొందుతారు. దీనిని మరో 2 సంవత్సరాలు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఎంపికైన  ఉపాధ్యాయులు యూఎస్ఏ కు వెళ్ళే ముందు వారికి అక్కడి బోధనా పద్దతులు, నియమ నిబంధనల గురించి ఏపిఎన్ఆర్టిఎస్ కార్యాలయం లో రెండు వారాల పాటు అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా  ప్రతినిధులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. 
ఈ నేపథ్యం లో ఏపిఎన్ఆర్టిఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ..  “అంతర్జాతీయ నియామకాల్లో” భాగంగా, ఏపిఎన్ఆర్టిఎస్ అందిస్తున్న ఈ అవకాశం విదేశీ పాఠశాలల్లో బోధించాలని కలలుకంటున్న ఉపాధ్యాయులకు ఒక వేదిక అవుతుందని తెలిపారు. తమ బోధనలో అంతర్జాతీయ అనుభవాన్ని గడించాలని కోరుకునే ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని  సూచించారు. 

ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs లాగిన్ అవ్వండి. దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 06 జనవరి 2020
మరింత సమాచారం కొరకు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు  0863 2340678, 8500027678 ను సంప్రదించండి. సువర్ణావకాశం -  ఏపిఎన్ఆర్టి సొసైటీ ద్వారా  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాఠశాలల్లో బోధించే అవకాశం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ  ఏపిఎన్ఆర్టి సొసైటీ అందించే వివిధ సేవలలో అంతర్జాతీయ నియామకాలు ఒకటి. రాష్ట్రంలో బోధనా రంగం లో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ఉపాధ్యాయులుగా బోధించే అవకాశం కల్పిస్తోంది.ఇందులో భాగంగా మొదటి విడతగా ఏపిఎన్ఆర్టిఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని స్టార్ టెక్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ  అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AGE) తో కలిసి చేపట్టిన అంతర్జాతీయ నియామకాల్లో  సెప్టెంబర్ 2019 లో 26 మంది ఉపాధ్యాయులు టెక్సాస్ లోని  ఎక్టర్ కౌంటీ  ఇండిపెండెంట్ మరియు కెర్మిట్  ఇండిపెండెంట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను గుర్తించిన అక్కడి పాఠశాల అధికారులు మరింత మంది ఉపాధ్యాయుల నియామకానికి  ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా వారు టెక్సాస్ లోని పలు జిల్లా పాఠశాలల్లో పనిచేయడానికి గణితం, సైన్సు బోధించే 50 మంది ఉపాధ్యాయుల  అవసరం  ఉందని ఏపీఎన్ఆర్టీ సొసైటీని సంప్రదించింది. ఈ క్రమం లో రెండవ విడతగా 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసే పనిలో భాగంగా ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది  ఏపిఎన్ఆర్టి సొసైటీ.

అంతర్జాతీయ ఉపాధ్యాయులుగా ఎంపిక అవడానికి … బి.ఎడ్/ఎం.ఈ.డి  కలిగి ఉండి, బోధనా రంగం లో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండాలి.  వీసా ప్రాసెస్ కొరకు టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపికైన  ఉపాధ్యాయులకు ౩ సంవత్సరాల గడువు కలిగిన J1 వీసా పొందుతారు. దీనిని మరో 2 సంవత్సరాలు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఎంపికైన  ఉపాధ్యాయులు యూఎస్ఏ కు వెళ్ళే ముందు వారికి అక్కడి బోధనా పద్దతులు, నియమ నిబంధనల గురించి ఏపిఎన్ఆర్టిఎస్ కార్యాలయం లో రెండు వారాల పాటు అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా  ప్రతినిధులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. 
ఈ నేపథ్యం లో ఏపిఎన్ఆర్టిఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి  మాట్లాడుతూ..  “అంతర్జాతీయ నియామకాల్లో” భాగంగా, ఏపిఎన్ఆర్టిఎస్ అందిస్తున్న ఈ అవకాశం విదేశీ పాఠశాలల్లో బోధించాలని కలలుకంటున్న ఉపాధ్యాయులకు ఒక వేదిక అవుతుందని తెలిపారు. తమ బోధనలో అంతర్జాతీయ అనుభవాన్ని గడించాలని కోరుకునే ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని  సూచించారు. 

ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs లాగిన్ అవ్వండి. దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 06 జనవరి 2020
మరింత సమాచారం కొరకు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు  0863 2340678, 8500027678 ను సంప్రదించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com